Warangal TV. Social & Entertainment live channel on Web media. Our channel top priorities are Warangal Real time issues, Interviews, Short movies, Comedy Skits,Crockery shows, Health, Tourism, Women issues and Education. Warangal TV is very close to the hearts of its Viewers. Stay tuned to our channel for more Social and entertaining programs.

Subscribe our channel :-

Follow Us on Our Social Sites :-
Facebook :- www.facebook.com/Warangaltv-855248467959327/
Twitter :- twitter.com/warangaltv


Warangal TV

5 days ago | [YT] | 6

Warangal TV

Proud Movement For Warangal ... హనుమకొండ జిల్లా....

రాష్ట్రపతి భవన్‌లో జరిగిన జాతీయ క్రీడా అవార్డుల ప్రధానోత్సవంలో గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా నేడు అర్జున అవార్డును అందుకున్న మన తెలంగాణ క్రీడారత్నం, వరంగల్ జిల్లా పర్వతగిరి మండల పరిధిలోని కల్లెడ గ్రామ ముద్దుబిడ్డ, పారా ఒలింపియన్ అథ్లెట్ దీప్తి జీవంజి కి హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి * కేఆర్ నాగరాజు...

తెలంగాణ లో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడ నాటి నుంచి గౌరవ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో క్రీడలను ప్రోత్సహిస్తూ వారిని గౌరవిస్తూ అలాగే మరింత మంది క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో రాణించేలా మెరుగైన స్పోర్ట్స్ పాలసీతో ప్రజా ప్రభుత్వం ముందుకుపోతున్న విషయాన్ని ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు గుర్తుచేశారు....

6 days ago | [YT] | 14

Warangal TV

ప్రభుత్వం అందిస్తున్న పథకాలను అర్హులైన అందరికీ అందే విధంగా కృషి చేయాలి.. ఎంమ్మెల్యే యశస్విని రెడ్డి..*_

_*పార్టీ నాయకులందరూ క్షేత్రస్థాయిలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పని చేయాలి.. పాలకుర్తి నియోజకవర్గ ఇంచార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి..*_

_*పెద్దవంగర మండల ముఖ్యనాయకుల స్థాయి సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి*_

_నేడు పాలకుర్తి పట్టణంలోని ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయంలో పెద్దవంగర మండల ముఖ్యనాయకులతో మరియు మండలoలోని, వివిధ గ్రామాపార్టీ అధ్యక్షులతో కలిసి మండల స్థాయి సమీక్షా సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్ని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు దిశ నిర్దేశం చేసినా *గౌరవ పాలకుర్తి నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి యశశ్వినీ ఝాన్సీ రెడ్డి గార్లు.*_

_*ఈ సందర్బంగా ఎమ్మెల్యే యశశ్విని ఇంచార్జ్ ఝాన్సీ రెడ్డీ గార్లు మాట్లాడుతూ*____
_ప్రభుత్వం పేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందించే విధంగా కృషి చేయాలని అన్నారు,పార్టీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనే విధంగా కార్యకర్తల ప్రోత్సహించాలని,పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు తగిన గుర్తింపు గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరి పైన ఉందని అన్నారు,కాంగ్రెస్ పార్టీలో కష్టపడే వారికి తగిన గుర్తింపు ఉంటుందని,రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో అందరూ సమన్వయంతో పని చేసి పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలనీ తెలిపారు,ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాలను ప్రజలలోకి తీసుకొని వెళ్లి అందరికీ అవగాహన కల్పించాలని కోరారు, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించుకొని పనిచేయాలని కార్యకర్తలకు నాయకులకు దిశా నిర్దేశం చేశారు._

_ఈ కార్యక్రమంలో___
_ప్రజాప్రతినిధులు, మండల ముఖ్య నాయకులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, గ్రామ ముఖ్య నాయకులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు._

6 days ago | [YT] | 5

Warangal TV

సింగపూర్‌ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి

సింగపూర్ పర్యటనలో ఆ దేశ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్‌తో భేటీ అయిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

గ్రీన్ ఎనర్జీ, వాటర్ మేనేజ్మెంట్, టూరిజం, ఎడ్యు కేషన్ &స్కిల్స్ బిల్డింగ్, ఐటీ పార్క్స్ వంటి అంశాలపై చర్చ

సీఎం వెంట ఉన్న మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు.. ఈనెల 19 వరకు సింగపూర్లోనే ఉండనున్న సీఎం రేవంత్ బృందం

6 days ago | [YT] | 4

Warangal TV

ఖోఖో ప్రపంచ కప్ కార్యక్రమానికి న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర కోకో ప్రెసిడెంట్ జంగా రాఘవరెడ్డి ...

1 week ago | [YT] | 13

Warangal TV

*_పతంగులు ఎగురవేస్తున్నారా.. అయితే ఈ జాగ్రతలు తప్పనిసరి_*

*_👉🏻పతంగులు బిల్డింగ్‌లపై ఎగురవేసేటప్పుడు కింద పడే అవకాశం ఉంటుంది. అందుకే చూసుకొని పతంగులను ఎగురవేయాలి._*

*_👉🏻మాంజా దారాల వినియోగంతో మెడకు చుట్టుకొని చనిపోయే అవకాశం ఉంది._*

*_👉🏻విద్యుత్‌ స్తంభాలు, తీగలు, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద గాలి పటాలు ఎగురవేయవద్దు._*

*_👉🏻విద్యుత్‌ వైర్ల మీద పడిన గాలి పటాలను తీసుకునేందుకు ప్రయత్నించరాదు._*

*_👉🏻తెగిపోయిన పతంగుల దారాలు పక్షుల మెడలకు బిగుసుకొని చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి పతంగులను ఖాళీ ప్రదేశాల్లో ఎగురవేయాలి...._*

1 week ago | [YT] | 1

Warangal TV

హనుమకొండ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 54వ డివిజన్ పోచమ్మకుంట (హనుమాన్ నగర్ )లో
జై హనుమాన్ పరపతి సంఘ ఆధ్వర్యములో నిర్వహించిన భోగి ముగ్గుల పోటిల్లో బహుమతుల ప్రధానోత్సవ వేడుకకు హాజరైన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారి సతీమణి శ్రీమతి నాయిని నీలిమా రెడ్డి .

ముగ్గుల పోటీలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతును అందజేశారు. ఈ సంక్రాంతి పండుగ అందరి జీవితాల్లో బోగా భాగ్యలు నింపాలి కోరుకున్నారు.

నిన్న రాత్రి 59వ డివిజన్ ఇంద్ర నగర్ కాలనిలో నిర్వహించిన ముగ్గుల పోటీలలో పాల్గొని బహుమతులు అందించారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు నల్ల సత్యనారాయణ, కంది కొండ సదానందం, దేవేంద్ర చారి, మురళి, ముగ్గుల పోటీల న్యాయనిర్నేతలు గుంటి స్వప్న,శోభ, లక్ష్మీ మరియు స్థానిక కాలనీ వాసులు, 59 వ డివిజన్ నుంచి టీపీసీసీ మీడియా అండ్ కమ్యూనికేషన్ చైర్మన్ కేతిడి దీపక్ రెడ్డి,
కార్పొరేటర్ గుజ్జుల వసంత, డివిజన్ అధ్యక్షులు రవి కిరణ్, మహిళా అధ్యక్షులు తెల్ల సుగుణ కిషోర్,కాలని అధ్యక్షులు దొంగరి శ్రీనివాస్,శివ ప్రసాద్, శ్యామ్ ప్రసాద్, దన్ రాజ్, కుమారస్వామి, సాంబారెడ్డి, మల్లారెడ్డి, బాలు నాయక్, ప్రభకర్,పల్లవి, మాధవి, రాధిక,విజయలక్ష్మి, భాగ్య లక్ష్మీ, సరిత, కవిత తదితరులు పాల్గొన్నారు.

1 week ago | [YT] | 7

Warangal TV

1 week ago | [YT] | 2

Warangal TV

*హనుమకొండ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి పి.ప్రావీణ్య గారి అధ్యక్షతన నిర్వహించిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశంలో పాల్గొన్న వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు,మేయర్ శ్రీమతి గుండు సుధారాణి గారు,KUDA చైర్మన్ ఇనగాల వెంకట్రాం రెడ్డి గారు,గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీమతి అశ్విని తనాజీ వాకాడే గారు…*

ఈ సమీక్షలో ముఖ్యంగా చర్చించిన అంశాలు…

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కి. స్మార్ట్ సిటీ నిధుల ద్వారా జరుగుతున్న పనుల పురోగతిపై చర్చించారు.

భద్రఖాళీ బండ్ మరియు వడ్డేపల్లి బండ్ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.
బండ్ ఆవరణలో ఓపెన్ జిమ్ లను ఏర్పాటుచేసి మౌలిక వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

నగరంలో పార్క్ లలో ఉన్న ఓపెన్ జిమ్ పరికరాలను మరమత్తులు చేసి నాణ్యత ప్రమాణాలు పాటించాలని కోరారు.

బాలసముద్రం మరియు పోతన నగర్ లలో ఉన్న GWMC డాంప్ యార్డులను వెంటనే పూర్తి చేయలని స్థానిక ప్రాంత ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించిన ఏమ్మెల్యే గారు.

నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించిన కాంట్రాక్టర్ లకు కచ్చితమైన ఆదేశాలు ఇవ్వాలని సదరు కాంట్రాక్టర్ తీసుకున్న పనులను అన్నింటిని సమవుజ్జీగా ప్రారంభించాలని నిర్ణయించారు.

మాస్టర్ ప్లాన్ అనుగుణంగా నగరంలోని ప్రధాన రహదారులకు ఇరువైపులా విస్తరణ పనులను చేపట్టాలని అధికారులకు ప్రత్యేక అధికారాలు జారీ.

హనుమకొండ బస్టాండ్ జంక్షన్ నుంచి కాంగ్రెస్ భవన్ వరకు ఎడమ వైపు ఉన్న ప్రభుత్వ స్థలాన్ని వెడల్పు చేస్తే రోడ్డు పై ట్రాఫిక్ నియంత్రణ జరుగుతుంది.

ప్రధాన రహదారుల్లో ఉన్న భవనాలకు వెనక్కి వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

షాపింగ్ కాంప్లెక్స్ లలో గ్రౌండ్ ఫ్లోర్ లో పార్కింగ్ స్థలం ఏర్పాటు చేసుకునేలా అందరికీ అవగాహన కల్పించాలని సూచించారు.

కాంగ్రెస్ భవన్ నుంచి రెడ్డి కాలనీకి వెళ్లే మార్గంలో రోడ్డు వెడల్పులో ఉన్న వారికి రెండుపడకల ఇళ్లు మంజూరు చేయాలని తెలిపారు.

పోతన నగర్ రోడ్డు వైన్డింగ్ మరియు భద్రకాళి అమ్మవారి పార్కింగ్,పెద్దమ్మగడ్డ చివర రోడ్డు విస్తరణ పరిశీలించాలని,బాధితులు ఉంటే వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని కోరారు.


నగరంలో ఇంకా ఏమైనా ఖబ్జాలు ఉంటే అధికారులు వెంటనే దృష్టికి తీసుకుని రావాలని ఏమ్మెల్యే ఆదేశించారు.

అసంపూర్తిగా ఉన్న వెజ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని,రోడ్డుపై ఉన్న వారిని లోపలికి తీసుకోవాలని సూచించారు.

ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రధాన రహదారుల వెంట ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూడాలని సూచించారు.


ప్రధానంగా రద్దీగా ఉండే దవాఖానలు,షాపింగ్ మాల్స్,హోటల్స్ లలో గ్రౌండ్ లలో పార్కింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మరి ముఖ్యంగా నూతనంగా నిర్మించే వ్యాపార సముదాయాల భవనాలకు పార్కింగ్ సౌకర్యం ఉంటేనే పర్మిషన్ ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

భద్రఖాలి అమ్మవారి దర్శనం కోసం భక్తుల సాంద్రత ఎక్కువగా ఉన్న దృష్ట్యా భక్తులకు అసౌకర్యం కల్పించకుండా ఉండేలా రెవెన్యూ,కార్పొరేషన్ ,టౌన్ ప్లానింగ్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పార్కింగ్ ఏర్పాటుకు ప్రత్యేక కమిటీ వేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మహిళాశక్తి కాంటీన్ లు ఇప్పటికీ నియోకవర్గంలో 3 అందుబాటులో ఉన్నాయి.మహిళలకు చేయూత ఇచ్చేలా ప్రభుత్వం ప్రత్యేకంగ అమలు చేస్తున్న పథకం ఇందిర మహిళా శక్తి క్యాంటీన్ లను నగరంలో మరిన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణలో,RTC బస్ స్టాండ్ ఆవరణలో,రిజిస్ట్రేషన్ కార్యాలయ ఆవరణలో ఇందిరా మహిళా శక్తి కాంటీన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

పశ్చిమ నియోజకవర్గ పరిధిలో స్వచ్ఛ ఆటోలు 142 ఉన్నాయి.నిరంతరం డ్రైనేజీ వ్యవస్థ,చెత్త సేకరణ పనులను ఎప్పటికప్పుడు చేయాలని అధికారులకు కోరారు.

నగరంలో ప్రధానంగా ఉన్న పార్క్ ల అభివృద్ధి కోసం నిధులను కేటాయించాలని వెల్లడించారు.

కాజీపేట నుంచి సోముడి మార్గంలో సెంటర్ లైటింగ్ ఏర్పాటుకు నిధులు మంజూరు జరిగాయి.

హంటర్ రోడ్డు లోని విష్ణుప్రియ గార్డెన్స్ పరిసర ప్రాంతాల్లో వెంటనే సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు.

పాలిటెక్నిక్ కళాశాల నిర్మానం కోసం టెండర్ ప్రక్రియ పూర్తి అయ్యిందని,శంకుస్థాపన చేసి పనులను వేగవంతం చేయాలని కోరారు.

కుల సంఘాల కమ్యూనిటీ భవనాల నిర్మాణం కోసం నిధులు విడుదల,స్థల కేటాయింపు అంశాలపై చర్చించారు.
మంత్రి గారి ఆదేశాల మేరకు ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ వేగవంతం చేయాలని,లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ,అర్థవంతంగా నిర్మాణం లో ఉన్న గృహాల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు.

లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించాలని,ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని అన్నారు.


నియోజకవర్గ పరిధిలోని మరిన్ని కీలక అంశాలపై చర్చించారు.

ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి,RDO రాథోడ్ రమేష్,మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ రవీందర్,ట్రాఫిక్ ఏసీపీ ,భాను కిరణ్,KUDA ఈ ఈ భీం రావు,ఇరిగేషన్ EE సీతారాం నాయక్,ఆర్ అండ్ బి EE సురేష్ బాబు,నోడల్ అధికారి రాజేందర్,తహసీల్దార్లు భావ్ సింగ్,శ్రీపాల్ రెడ్డి మరియు ఆర్ అండ్ బి,టౌన్ ప్లానింగ్,స్మార్ట్ సిటీ,విద్యుత్తు శాఖ,గృహ నిర్మాణ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

2 weeks ago | [YT] | 7

Warangal TV

రాజ్ భవన్ లో గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఛైర్మెన్ శ్రీ జంగా రాఘవ రెడ్డి గారు
ఈ సందర్బంగా ఢిల్లీ లో జరగానున్న ఖోఖో వరల్డ్ కప్ 2025 జనవరి 13 నుండి 19 తారీకులో జరిగే ఈ వేడుకలో సుమారు 600 మంది క్రీడాకారులు మొత్తం 24 దేశాల నుండి పాల్గొనున్నారు,ఇందిరా గాంధీ స్టేడియం కాంప్లెక్స్ లో అట్టహాసంగా జరగానున్న ఈ ఇంటర్నేషనల్ వేడుకకు గవర్నర్ గారిని ఆహ్వానించించారు.

ఈ కార్యక్రమంలో,ఖో ఖో తెలంగాణ సెక్రటరీ కృష్ణ మూర్తి గౌడ్ గారు పాల్గొన్నారు…….

2 weeks ago | [YT] | 17