Nandu's World

*ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA) - ప్రపంచ ముగ్గుల పోటీ*

nationalconvention1.theaaa.org/reg/rangolicontest.…

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ మరియు తెలుగు భాషాభిమానులకు AAA తరఫున నమస్కారం!

*AAA* ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న *ప్రథమ మహాసభలు 2025 - మార్చ్ 28 & 29* తేదీలలో అమెరికా రాష్ట్రంలోని పెన్సిల్వేనియా లోని OAKS నగరంలో జరగబోతున్నాయి. ఈ కార్యక్రమాలు ఎంతో అంగరంగ వైభవంగా, అట్టహాసంగా జరుగుతాయని మేము ఆశిస్తున్నాము.

ఈ అద్భుతమైన కార్యక్రమాల్లో భాగంగా *AAA* సంస్థ తరఫున *ప్రపంచ ముగ్గుల పోటీ* నిర్వహించబోతుంది. మీరు ఏ దేశం నుండి అయినా ఈ ముగ్గుల పోటీలో పాల్గొనవచ్చు.

మీరు మీ సృజనాత్మక మరియు అందమైన ముగ్గుల రూపకాలను వేసి మాకు పంపండి. ఇది మీ ప్రతిభను ప్రపంచానికి చాటుకునేందుకు అద్భుతమైన అవకాశం. ఈ పోటీలో మీరు అద్భుతమైన బహుమతులను కూడా గెలుచుకునే అవకాశముంది.

మరిన్ని వివరాల కోసం, మీరు గెలుచుకోబోయే *అనూహ్యమైన నగదు బహుమతి* మరియు నియమాలు, నిబంధనలను గురించి తెలుసుకోవడానికి క్రింది వెబ్సైట్ మరియు ఫ్లయిర్‌ను చూడగలరు.

మరెందుకు ఆలస్యం? 🤷‍♂️ వెంటనే మీ ముగ్గుల కళాకృతులను సిద్ధం చేసుకోండి మరియు మీ సమాచారాన్ని క్రింది వెబ్సైట్‌లో దరఖాస్తు చేసుకోండి!

nationalconvention1.theaaa.org/reg/rangolicontest.…

1 week ago | [YT] | 835