లౌకికమైన పరిధులకి దూరం గా జీవితం లో ఎదురు పడే అందమైన అనుభూతులను పరిచయం చేసే ప్రయత్నం లో పాదం కదిపే పయనమే ఈ వన విహారి.
అరణ్యం లో ఆహ్లాదం గా విహరించే జీవికి కనిపించే ప్రతి చోటు, ఎదురయ్యే ప్రతి మలుపు, పలకరించే ప్రతి పరిచయం మిగిల్చేవి అన్నీ గుర్తులే. కొన్ని అనుభవాల రూపం లో పాఠాలు నేర్పుతాయి చాలా వరకు మనం వేసే మరో అడుగుకి ఉత్సాహం ఇస్తాయి.
ఇలా తారస పడే ప్రతిదీ పది మంది తో పంచుకునే ప్రయత్నమే ఈ చానెల్.