2015 ఆగష్టు 31వ తేదీనే “శివశక్తి” ఆవిర్భావం జరిగింది. సామాజిక మాధ్యమాలలో, బహిరంగసభల్లో కొన్ని సంస్థలు, వ్యక్తులు పనిగట్టుకుని హిందూ ధర్మాన్ని విమర్శించడం, హిందూ దేవీ దేవతలను అవమానించడం చూసి భరించలేక “సనాతన ధర్మ రక్షణే జీవిత ధ్యేయంగా 30 మంది కలసి స్థాపించిన శివశక్తి నేడు వేలమందితో కూడిన సంస్థగా భాసిల్లుతోంది.
హైందవ మత గ్రంధాలను వక్రీకరిస్తూ వస్తున్న గ్రంథాలు “వేదాలలో ఏసు, పురాణాలలో మహమ్మద్ ప్రవక్త, హైందవ క్రైస్తవం, త్రైత సిద్ధాంత భగవద్గీత” లాంటి వక్రీకరణ గ్రంథాలను కూడా “శివశక్తి” వ్యతిరేకీస్తూ వాటిని ఖండిస్తూ సవివరంగా సనాతన ధర్మ గ్రంథాల తత్వాన్ని వివరిస్తుంది. ఈ లక్ష్య సాధనలో భాగంగా ఆధ్యాత్మిక గ్రంథాలపై జరుగుతున్న అసత్య ప్రచారాలను, అన్ని మత గ్రంథాలలో ఉన్న సత్యాన్ని ప్రజలకు తెలియజేసి ప్రజలని చైతన్యవంతులని చేయడం కోసం ప్రజల సమక్షంలో బహిరంగ చర్చా వేదికలను నిర్వహించడం జరిగింది. ఈ మహాత్కార్యంలో మీరు కూడా భాగస్వాములై మీ సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ సాదరంగా ఆహ్వానిస్తిన్నాము.
ధర్మో రక్షతి రక్షితః
-Shiva Shakthi