Bhuloka Veedhullo

నా పేరు శివ ప్రసాద్.

నాది శ్రీకాకుళం జిల్లా పలాస దగ్గరలో ఉన్న గురుదాసుపురం గ్రామం
నేను Master of Pharmacy (M.Pharmacy) చదివాను. ప్రస్తుతం నేను క్లినికల్ ట్రయిల్ లో పని చేస్తున్న.

నేను ఈ భూలోక వీధుల్లో ఛానెల్ మీ ముందుకు తీసుకురావటానికి ముఖ్యకారణం నాకు మన ప్రాచీన సంస్కృతి మరియు సాంప్రదాయాలు మీద ఉన్న ఇష్టం అలాగే మా నాన్న నాకు మన సంస్కృతి ధర్మం ప్రకారం పెంచడం. ఇంకా చెప్పాలి అంటే పురాతన కట్టడాలు, స్మారక చిహ్నాలు మరియు దేవాలయాలు చూసినప్పుడు నా మనసులో ఏదో తెలియని పులకింత.

ఈ యూట్యూబ్ ఛానెల్లో (భూలోక వీధుల్లో) ముఖ్యంగా మన సంస్కృతి, సంప్రదాయాలు, ధర్మము, తత్వాలు, ఆధ్యాత్మికం, దేవాలయాలు, చరిత్రలు ఇంకా అనేక ప్రదేశాలు యొక్క వీడియోలు లేదా ప్రసంగం రూపం లో క్లుప్తంగా ఉంటాయి.

ఈ ప్రస్తుత ఛానెల్‌లో ఉన్న వీడియోలు మీ అందరికి ఎంతో ఉపయోగపడతాయి అని అనుకుంటున్నా.

అలాగే ఈ భూలోక వీధుల్లో చాన్నెల్ని ముందుకు తీసుకువెళ్ళడానికి మీ సహాయ సహకారాలు నాకు ఎంతో ఆవసరం